Jathara Song Lyrics – Peddha Kapu 1 Lyrics - Anurag Kulkarni
| Singer | Anurag Kulkarni |
| Composer | Mickey J Meyer |
| Music | Mickey J Meyer |
| Song Writer | Kalyan Chakravarthi |
Jathara Song Lyrics in Telugu
డండక డుం డండక డుం
డండక డుం డుం డుం
డండక డుం డండక డుం
డండక డుండక డుం
దిట్టంగా దూకు దిష్టికే
ఉప్పొచ్చి నిప్పు తాకెనే
దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై
సమ్మెట్ల సాగు డప్పుకే
ఉగ్రాలు ఊరికొచ్చెనే
పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై
పసుపంటిన కత్తికి కూడా
పదునెప్పుడు చివరకు ఎరుపే
కల్లోలపు కాష్టం రగిలే
చితుకులు చింతలవేలేరా
పొలిమేరలు అడవికి ఉన్నా
వేటాడగ హద్దులు లేవే
పుట్టేందుకు యుద్ధము కారణమేదో
సేనకు తెలియదురా
రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఆనాడు పోయిందా
రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఓనాడు ఓడిందా
కడసాగని కాలం ప్రతిసారి
వెతికింది ఓ నెత్తుటి దారి
అవకాశపు ఆశల నీడలు
కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి
తను వేసిన ఉచ్చులతో
పెను ఉత్సవమే
అను నిత్యం జత చేసి
డండక డుం డండక డుం
డండక డుం డుం డుం
డండక డుం డండక డుం
డండక డుండక డుం
ఒడ్డూ వరద కలుసుకొని
చెట్టా పట్టాలేసుకొని
నవ్వుతుంటె గోదారే
కళ్ళు చాలవే
నిద్దురలా తానున్నా
గుంబనంగ గోదారి
కట్టుతప్పి పోయిందా
అడ్డే వాడు కనరాడే
తడి అడుగుల ఈ నేల
తను ఎవరని అడిగిన ఓ వేళ
తలవాకిట తీరని తోడుగ
కాసిన కొరివికి కాడుకు వెరుపేలా
ఎనకటి కథ యేటికి నేర్పాలా
ఏడుపు వ్యధ గొంతుకు చెప్పాల
చనుబాలకు అంచున చేసిన
గాయపు రాతలు చరితను చదవాలా
పసుపంటిన కత్తికి కూడా
పదునెప్పుడు చివరకు ఎరుపే
కల్లోలపు కాష్టం రగిలే
చితుకులు చింతలవేలేరా
పొలిమేరలు అడవికి ఉన్నా
వేటాడగ హద్దులు లేవే
పుట్టేందుకు యుద్ధము కారణమేదో
సేనకు తెలియదురా
రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఆనాడు పోయిందా
రణ నీతినే రాసేందుకు
రక్తాన్ని వాడని తావుందా
ఒక గీతతో బలహీనత
ఓనాడు ఓడిందా
కడసాగని కాలం ప్రతిసారి
వెతికింది ఓ నెత్తుటి దారి
అవకాశపు ఆశల నీడలు
కమ్మిన కన్నుల చూపులు ఎరవేసి
తను వేసిన ఉచ్చులతో
పెను ఉత్సవమే
అను నిత్యం జత చేసి
దిట్టంగా దూకు దిష్టికే, ఓయ్
ఉప్పొచ్చి నిప్పు తొక్కెనే
దుర్గమ్మ తల్లి కళ్ళకే వెలుగై
ఓ ఓ, సమ్మెట్ల సాగు డప్పుకే
ఉగ్రాలు ఊరికొచ్చెనే
పెద్దమ్మ రంగమెక్కగా ఉడుకై
డండక డుం డండక డుం
డండక డుం డుం డుం
డండక డుం డండక డుం
డండక డుండక డుం
Comments
Post a Comment